బజారహత్నూర్‌లో పర్యటించిన కలెక్టర్
ADB: బజార్హత్నూర్‌లోని పిప్పిరీ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్ బుధవారం పర్యటించారు. ఈనెల 6న నిర్వహించే సీఎం సభ స్థలిని DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.