కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కలకలం

సంగారెడ్డి జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సదాశివపేటలోని పట్నం హైవే హోటల్లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో ఆ యువకులు హోటల్ యజమానిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆహార భద్రత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.