VIDEO: శాస్త్రీయ విధానంతో నీటి వనరుల గుర్తింపు
BDK: ఇల్లందు పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ నివాస్ నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా శాస్త్రీయ పద్ధతిని ఆశ్రయించారు. నీళ్లు పడవు అన్న సందేహాల మధ్య కూడా ఎలాగైనా నీళ్లు కనుగొనాలి అన్న దృఢ సంకల్పంతో, భూగర్భజలాల శాస్త్రీయ పరిశీలన కోసం నిపుణులను సంప్రదించి, డ్రిల్లింగ్ చేయగా, ఆశించిన విధంగానే సమృద్ధిగా నీళ్లు లభించాయని వెల్లడించారు.