కాంగ్రెస్ నేత హత్యకేసులో నిందితుల అరెస్ట్

KRNL: కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కర్నూలు ఏఎస్పీ హుస్సేన్ పీరా ఇవాళ వెల్లడించారు. గత నెల 27న జరిగిన లక్ష్మీనారాయణ హత్యలో 10 మంది నిందితులను గుర్తించామన్నారు. అందులో రాజేశ్ గౌసియా, సౌభాగ్యను అరెస్ట్ చేశామన్నారు. భూ వివాదాలు, పంచాయితీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.