అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య..!

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య..!

ATP: అప్పుల బాధ తట్టుకోలేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దవడుగూరు మండలం భీమునిపల్లికి చెందిన చిన్నారెడ్డి గత కొంత కాలంగా అప్పులతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన అతను ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.