80 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

SRD: జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్‌కు చెందిన తిరుమలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.