'మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి'
SRCL: జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు తప్పకుండా ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈఎంఆర్ఎస్ గురుకులాల డీసీవోలు, జీసీడీవో, డీఈవోతో జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.