పోలీసుల కార్డెన్ సెర్చ్.. వాహనాలు సీజ్

పోలీసుల కార్డెన్ సెర్చ్.. వాహనాలు సీజ్

నెల్లూరు జిల్లా పొదలకూరులోని ఎమ్మార్వో కాలనీలో నేరాల నియంత్రణకై రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 15 వీధుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 2 బైకులను సీజ్ చేశారు. అనంతరం నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.