'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

NDL: యూరియా సరఫరా లేక పంపిణీపై ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే నంద్యాల కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌కు 08514-293903 సమాచారం అందించవచ్చునని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కంట్రోల్ రూమ్ ఈ నెల 4 నుంచి ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందన్నారు. యూరియా అందుబాటుపై రైతులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.