'రైతులు పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి'
GNTR: ఫిరంగిపురం మండలంలోని శిరంగిపాలెం గ్రామంలో ఇవాళ పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జై వాసంతి రైతులతో చర్చించి, వరిలో చీడపీడల యాజమాన్యం, ఎరువుల వాడకం, పొడ తెగుళ్ల నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పొడ తెగులు వచ్చే అవకాశం ఉన్నందున, రైతు సోదరులు పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.