VIDEO: రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
WGL: వరంగల్ నగరంలోని శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు సీతారామ లక్ష్మణులకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు భక్తులు ఉదయాన్నే ఆలయానికి పోటెత్తారు.