రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

MLG: వెంకటాపురం మండలంలో రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరూ గాయల పాలయ్యారు. స్థానికుల వివరాలు.. వెంకటాపూరం మండలం లింగాపూర్ క్రాస్ జాతీయ రహదారిపై మేడారం వెళ్లి వస్తున్న ఓ వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.