రేపు హనుమకొండలో ట్రాఫిక్ మళ్లింపు
హనుమకొండలో ఆదివారం మారథాన్ రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు పలు ట్రాఫిక్ మార్గాలలో డైవర్షన్ అమలులో ఉంటుందని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.