అమ్మవారి సేవలో ఏపీ అడ్వకేట్ జనరల్

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.