సింహాచలంలో సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

సింహాచలంలో సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

విశాఖ: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారిని ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం వంటి క్రతువులు చేపట్టారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో సంకల్ప పూజలు చేయించి స్వామివారి కళ్యాణ ఘట్టాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిపించారు.