'యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం'

GDWL: గట్టు మండలంలో యూరియా కొరతపై రైతులు చేస్తున్న నిరసనకు బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మద్దతు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వర్షాలు కురుస్తున్నా, సరైన సమయంలో ఎరువులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.