జాతీయ రహదారిపై పడిపోయిన బారికేడ్లు
SRPT: మునగాల పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారి 65 జంక్షన్ వద్ద వాహనాల వేగ నియంత్రణకు ఏర్పాటు చేసిన బారికేడ్లు కిందపడిపోయాయి. గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్లే ఇవి పడిపోయినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చే వాహనదారులు వీటిని గమనించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.