శ్రీరామనవమి.. దేశవ్యాప్తంగా ఆలయాలు కిటకిట
శ్రీరామనవమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శ్రీరాముడి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. అలాగే అయోధ్యలోని భవ్య రామమందిరం భక్తులతో రద్దీగా మారింది. మ. 12 గంటలకు రామ్ లల్లా నుదిటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ఈ అద్భుత దృశ్యానికి చూడటానికి వేలాదిగా భక్తులు తరలివెళ్తున్నారు. ముందుగా సరయూ నదిలో పుణ్య స్నానాలు చేసి ఆలయానికి వెళ్లి రాముల వారిని దర్శించుకుంటున్నారు.