నూతన GP కార్యాలయాన్ని ప్రారంభించిన MLA గండ్ర
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆదివారం భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు, సర్పంచ్ నిమ్మల శంకర్, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు ఓం ప్రకాష్‌తో కలిసి ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు. ఉప సర్పంచ్ రవి, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.