VIDEO: ఉపాధ్యాయినిగా మారిన కలెక్టర్
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని కేజీబీవీని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అనంతరం వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదవాలని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.