గాంధీ విగ్రహం పై దాడికి వ్యతిరేకంగా నిరసన
MDK: తూప్రాన్ పట్టణ పరిధి తాతపాపన్ పల్లిలో మహాత్మ విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు గ్రామస్తులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.