రాష్ట్రస్థాయి హాకీ జట్టుకు సంతోష్ ఎంపిక
WNP: పెద్దమందడి మండలంలోని అనకాపల్లి తండాకు చెందిన సంతోశ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. 17 ఏళ్ల బాలుర విభాగంలో తెలంగాణ రాష్ట్ర హాకీ జట్టుకు సంతోశ్ ఎంపికైనట్లు గ్రామ మాజీ సర్పంచ్ రామదాసు నాయక్ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సంతోష్, గిరిజన ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.