తిరుమలలో భక్తులకు అదనంగా దిండు, దుప్పటి
AP: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలోని వసతి గృహాల్లో పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది. దిండు, దుప్పటి, చాప, రగ్గులను భక్తులకు అందించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం నందకంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలో మిగిలిన వసతి గృహాల్లోనూ సేవలను విస్తరించనున్నారు. అయితే ఒక దుప్పటికి రూ.10, 2 దిండులు రూ.10, చాప రూ.10, రగ్గు రూ.20లను ఛార్జ్ చేస్తారు.