కలుషిత నీరుతాగి 17 మందికి అస్వస్థత

NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో బుధవారం మంచినీరు కలుషితం కావడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నీరు తాగిన నాగమణి అనే మహిళ తీవ్ర అస్వస్థతతో మృతి చెందింది. అధికారులు అత్యవసర హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి, ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. నీటి మూలాలపై దర్యాప్తు చేపట్టారు.