గ్యాస్ వినియోగదారులకు కీలక సూచనలు
VZM: గ్యాస్ వినియోగదారులకు పౌర సరఫరాల అధికారి జీ.మురళీనాథ్ కీలక సూచనలు చేశారు. సిలిండర్లు బుక్ చేస్తే వారం రోజుల్లో రాకపోయినా, డెలివరీ బాయ్ అదనంగా డబ్బులు అడిగినా, వాణిజ్య అవసరాలకు డొమస్టిక్ గ్యాస్‌ను వాడినా వెంటనే తమకు తెలపాలని కోరారు. అందుకు 8074400947 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. దానికి వెంటనే పరిష్కారం జరుగుతుందని తెలిపారు.