పౌష్టిక ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: సీడీపీవో
SS: పౌష్టిక ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బుక్కపట్నం సీడీపీవో జయంతి, ఎంఈవో గోపాల నాయక్ తెలిపారు. బుధవారం బుక్కపట్నంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, అంగన్వాడీ టీచర్లు, పిల్లలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పుట్టబోయే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఎదుగుతారని తెలిపారు.