అమరావతి అంశంపై అసెంబ్లీలో లోకేష్ ఆగ్రహం
GNTR: అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అంశంపై శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తుచేసిన లోకేష్, “వారి త్యాగం వల్లే మనమందరం ఈరోజు ఇక్కడ ఉన్నాం' అన్నారు.