గంజాయి రవాణా కేసులో ఇద్దరి అరెస్ట్
PDPL: పోత్కపల్లి పరిధిలోని గుంపుల శివారులో ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో ఇద్దరు గంజాయి విక్రేతలను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 220 గ్రాముల గంజాయి, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విక్రయించే ఉద్దేశంతోనే గంజాయి తెచ్చినట్లు విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.