VIDEO: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి
WGL: మొక్కజొన్నలు పట్టే మిషన్ ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన ఘటన పర్వతగిరి మండలంలోని మల్యతండాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పంచరాయితండాకు చెందిన రైతులు బానోత్ రాములు, బానోత్ హర్లా మొక్కజొన్నలు పట్టేమిషన్ పైపనికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్‌కు అమర్చిన మిషన్ బోల్టు ఊడిపోవడంతో బోల్తాపడి మృతి చెందారు.