కూలీలకు దొరికిన తాత్కాలిక ఉపాధి
MNCL: జన్నారం మండలంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు తాత్కాలిక ఉపాధి దొరికింది. మండలంలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. డిసెంబర్ 11న స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కోసం వారిని వినియోగించుకుంటూ ఒక్కో నిరుపేదకు రూ.400-500 రోజువారి కూలీ చెల్లిస్తూ భోజనం పెడుతున్నారు.