'ఉల్లి రైతుల నష్ట పరిహారంపై సీఎం ప్రకటన చేయాలి'
KDP: కమలాపురం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉల్లి రైతుల నష్టపరిహారంపై ప్రకటన చేయాలని వైసీపీ రాష్ట్ర నిర్వహణ మండలి సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కమలాపురం నియోజకవర్గంలో గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు భారీగా నష్టపోయారని, అధిక వడ్డీలకు అప్పులు చేసి సాగు చేసిన రైతాంగం కన్నీరు పెట్టుకుంటుందని ఆయన అన్నారు.