ధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన
BDK: కొనుగోలు కేంద్రానికి పండించిన పంటను తీసుకువచ్చి 23 రోజులు దాటుతున్నా కొనుగోలు చేయకపోవడంపై పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన రైతు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం భూపాలపట్నం కొనుగోలు కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ.. సుమారు 120 బస్తాల ధాన్యాన్ని బరకాలు కప్పి ఉంచామని, వర్షం వచ్చినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.