గీసుగొండలో రూ.లక్షన్నర నగదు దొంగతనం

గీసుగొండలో రూ.లక్షన్నర నగదు దొంగతనం

WGL: గీసుగొండ మండలంలోని నందనాయక్ తండాలో చోరీ జరిగినట్లు ఎస్సై గైకాడి అనిల్ కుమార్ శనివారం తెలిపారు. కేలోత్ గోపాల్ ఇంట్లో దొంగలు చొరబడి బీరువా నుంచి రూ.లక్ష, హ్యాండ్ బ్యాగ్‌లోని రూ.50 వేలు, మొత్తం లక్షన్నర నగదు దొంగిలించారని చెప్పారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.