'ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండండి'
స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమ్ముదిని అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి ఇతర అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలన్నారు.