రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
కోనసీమ: మండపేట పట్టణం రథం సెంటర్‌లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆలయం ఎదురుగా వేగంగా వచ్చిన కారు వృద్ధురాలును ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.