పోలీసుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం: ఎస్పీ
నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవియన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సునీల్ షరాన్ పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలు విని వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు మెడికల్ హెల్త్, రిక్వెస్ట్ బదిలీలు, ఇతర వ్యక్తిగత కారణాల గురించి ఎస్పీకి విన్నవించారు. పోలీసుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు.