ఈ నెల 8న చేపమందు పంపిణీ

MNCL: దండేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈనెల 8న రంగసాయి ప్రేంసాగర్ భూలక్ష్మి దంపతులచే చేపమందు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపమందు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఒకరోజు ముందు వచ్చే వారికోసం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.