రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సిలింగ్
WGL: నేరాల నివారణలో భాగంగా మట్టెవాడ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు మిల్స్ కాలనీ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ శుభం నగరాలే మంగళవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. తమ జీవన విధానాన్ని మార్చుకుని సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని హితవు పలికారు.