న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం: MLA
WNP: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును ఇప్పటికే రూపొందించిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 'చలో హైదరాబాద్' మహా పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.