కష్టార్జితం వృథా చేసుకోవద్దు: కొలికపూడి

కష్టార్జితం వృథా చేసుకోవద్దు: కొలికపూడి

కృష్ణా: తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయుల బోధనతో విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ కళాశాలలకు పంపించి మీ కష్టార్జితం వృథా చేసుకోవద్దని సూచించారు.