నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

RR: రాజేంద్రనగర్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. యూనివర్సిటీ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, చింతల్ మెంట్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.