రోగుల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడి అరెస్ట్
HYD: నకిలీ వైద్యుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్ గూడ సమీపంలోని శ్రీకృష్ణ నగర్‌లో ఆశా హెల్త్ కేర్ క్లినిక్ పేరుతో ఆర్ఎంపీ వైద్యుడైన మహమ్మద్ ఇర్షాద్ ఎంబీబీఎస్ ముసుగులో రోగులతో చెలగాటమాడుతున్నాడు. దీంతో క్లినిక్‌లో సోదాలు నిర్వహించి ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ లేనట్లు గుర్తించి సోమవారం రిమాండ్‌కు తరలించారు.