LRS స్కీమ్.. గడువు పొడిగింపు
AP: LRSపై రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈనెల 23తో గడువు ముగియగా.. వచ్చే ఏడాది జనవరి 23 వరకు పొడిగించింది. అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ ఏడాది జూలై నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి రాయితీ కూడా ఇస్తున్నారు.