కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సింగిల్ విండో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అన్నారు.