గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: సింగరాయకొండలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్, పోలేరమ్మ తల్లి టెంపుల్ వద్ద ఓ వ్యక్తి నడిచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు సింగరాయకొండ మండలం వడ్డేపాలెంకు చెందిన కోనంకి కొండలు (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.