'మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి'
MLG: వెంకటాపూర్ (M) లక్ష్మీదేవిపేటలో మహిళా శక్తి భవనం శంకుస్థాపన, చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళలు స్వయం ఉపాధి మార్గాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని, స్వశక్తితో ఎదగాలన్నారు. ఈ మేరకు దారిలోని ఓ బజ్జీల బండి దగ్గర ఆగి నిర్వాహకురాలని పలకరించి వ్యాపారంపై ఆరా తీశారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు.