VIDEO: గుంటూరులో ట్రంప్ చిత్రపటం దహనం

VIDEO: గుంటూరులో ట్రంప్ చిత్రపటం దహనం

GNTR: గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ వద్ద సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ నిరసన చేపట్టారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని దహనం చేశారు. యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి శాంతిని నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధోన్మాదం కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.