అప్పులపై ఈటల రాజేందర్ మాట్లాడాలి: అద్దంకి

TG: BRS, బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే రేవంత్ వివరించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ మాట్లాడాలి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్యోగులు నమ్మొద్దు' అని సూచించారు.