పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

E.G: పేదల వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమండ్రి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇంత మొత్తంలో CMRF కింద చెక్కులు పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 510 మందికి రూ.4.40 కోట్లను సీఎం సహాయ నిధి కింద చెక్కులు అందజేశామన్నారు.