'బాల్యవివాహాలను అడ్డుకోవాలి'

'బాల్యవివాహాలను అడ్డుకోవాలి'

ATP: వజ్రకరూరు మండలంలోని ఛాయాపురం, కొనకొండ్ల గ్రామాలలో శనివారం కిశోర వికాస కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పద్మ, పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీడీపీఓ శ్రీదేవి పాల్గొని బాల్య వివాహాలతో కలిగే నష్టాలు, దుష్పరిణామాలు గురించి వివరించారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.